కోర్టులో నవ్విన ఎమ్మెల్యే...శిక్ష విధించిన జడ్జి

SMTV Desk 2019-03-16 18:56:10  karnataka high court, mla, devadurga constituency mla sivanagouda naik

బెంగుళూరు, మార్చ్ 16: కర్ణాటకలో ఓ ఎమ్మెల్యే కోర్టులో పదే పదే నవ్వడంతో అతనికి ఆ కోర్టు శిక్ష విధించింది. పూర్తి వివరాల ప్రకారం... కర్ణాటకలోని దేవదుర్గకు చెందిన ఎమ్మెల్యే శివనగౌడ నాయక్ ఓ కేసు విషయంలో కోర్టుకు హాజరై పదే పదే కోర్టు హల్లో నవ్వారు. ఇది గమనించిన న్యాయమూర్తి సదరు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధి అయి ఉండి కోర్టులో ఎలా నడుచుకోవాలో తెలియదా అని చురకలంటించారు. అలాగే సాయంత్రం వరకు కోర్టు కస్టడీలో ఉండాలని ఆదేశించించాడు. దీంతో అక్కడే ఉన్న ఎమ్మెల్యే న్యాయవాదులు జోక్యం చేసుకొని న్యాయమూర్తికి ఎమ్మెల్యే చేత క్షమాపణలు చెప్పించి ఇలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాదని చెప్పించి అక్కడినుంచి తీసుకొని వెళ్లారు.