సీక్రెట్ గా హీరో విశాల్ నిశ్చితార్ధం!

SMTV Desk 2019-03-16 17:42:41  vishal, engagment

హైదరాబాద్, మార్చ్ 16: తమిళ హీరో విశాల్.. హైదరాబాద్ అమ్మాయి అనిషాను వివాహం చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. వీరి వివాహానికి పెద్దలు కూడా అంగీకరించారు. కాగా, ఈరోజు హైదరాబాద్‌ లో విశాల్, అనిషాల నిశ్చితార్ధం జరుగుతున్నట్టు సమాచారం. ఈ నిశ్చితార్ధం ఎక్కడ జరుగుతున్నది.. ఎవరెవరు హాజరవుతున్నారు అనే విషయాలను చాలా సీక్రెట్ గా ఉంచుతున్నారు. కారణాలు ఏంటి అనేది తెలియాలి.

విశాల్ కుటుంబ సభ్యులు మరియు సన్నిహితులు మాత్రమే కార్యక్రమానికి హాజరవుతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం కోలీవుడ్ లో విశాల్ టెంపర్ రీమేక్ సినిమా అయోగ్యలో నటిస్తున్నారు.