తెగ వైరల్ అవుతున్న అంకుల్ డాన్స్

SMTV Desk 2019-03-16 16:05:58  Uncle dance,

ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో గోవిందా పాటలకు అదిరిపోయే స్టెప్పులేసి సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాస్తవ అంకుల్ గుర్తుండే ఉంటాడు. డాన్సింగ్ అంకుల్‌గా సుపరిచితమైన శ్రీవాస్తవ మరోసారి తన డాన్సుతో అదరగొట్టారు. అయితే ఈసారి గోవింద పాట కాకుండా తన సొంత పాటతో ఇరగదీశాడు.



‘చాచా నాచ్’ అనే సొంత మ్యూజిక్‌తో అద్భుతమైన స్టెప్పులతో చూపరులను మంత్రముగ్ధుల్ని చేశారు. కాగా వీడియో వివరణలో ప్రపంచంలో ఉన్న అంకుల్స్ అందరిలో భారతీయ డాన్స్‌ను విస్త్రృతం చేసిన వ్యక్తి’’ అని రాసుకొచ్చారు. ఈ వీడియోపై నెటిజెన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

‘‘వావ్.. అంకుల్ మళ్లీ వచ్చారు. అద్భుతమైన సంగీతం..’’అని ‘‘వీడియో, సంగీతం అద్భుతంగా ఉన్నాయి. లవ్ ఇట్..’’, ‘‘పూర్తిగా వినోదభరితంగా ఉంది. ఆయన మార్క్ స్టెప్పులు ఎంతగానో నచ్చాయి…’’ అని ప్రశంసిస్తూ ఎందరో కామెంట్ చేస్తున్నారు..