ఎయిర్ ఇండియాకు ఆంక్షలు విధించిన పాక్

SMTV Desk 2019-03-16 16:04:42  pakistan, air india, india, pulwama attack

న్యూఢిల్లీ, మార్చ్ 16: భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య యుద్దవాతరణ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో పాక్ ఎయిర్ ఇండియాపై పలు ఆంక్షలు విధించింది. తమ గగనతలం మీదుగా భారత విమానల రాకపోకలను రద్దు చేసింది పాక్‌. ఫిబ్రవరి 27 నుంచి పాక్‌ తన గగన తలాన్ని మూసివేసింది. దీంతో భారత్‌ విమానయాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల్లో విమాన రాకపోకలను కొనసాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎయిర్‌ ఇండియాకు సిబ్బంది కొరత ఎదురవడంతో సెలవులో ఉన్న ఉద్యోగులు వెంటనే విధులను చేపట్టాలని ఎయిర్‌ ఇండియా యాజమాన్యం లేఖ ద్వారా ఆదేశించింది. ఎయిర్‌ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మధు మాథెన్‌ ఈ అంశంపై తమ సిబ్బందికి లేఖ రాస్తూ ‘పాక్‌ తన గగనతలాన్ని మూసివేయడం వల్ల ప్రత్యామ్నయ మార్గాల్లో పనులు కొనసాగిస్తున్నాం. ఈ పరిస్థితుల వల్ల స్టాఫ్‌ఓవర్‌, సిబ్బంది అవసరం పెరిగింది. కాబట్టి సెలవుల్లో ఉన్న సిబ్బంది తక్షణమే విధుల్లో చేరాలని కోరుతున్నాం. త్వరలోనే ఈ అసాధారణ పరిస్థితి సద్దుమణుగుతుందని ఆకాంక్షిస్తున్నాం అని ఆయన లేఖలో పేర్కొన్నారు.