5 ఏళ్లలో 5 లక్షలు

SMTV Desk 2019-03-16 14:57:02  post office, post office saving scheme

న్యూఢిల్లీ, మార్చ్ 16: భారతదేశంలో పోస్టాఫీసు సేవింగ్స్‌ స్కీమ్స్‌కు మంచి పేరు ఉంది. పట్టణ ప్రాంతాల కన్నా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వీటి అవసరం ఎక్కువగా ఉంటుంది. సార్వభౌమ హామీ ఉండటం, వడ్డీరేట్లు ఆకరణీయంగా ఉండటమే ప్రధానకారణం. దానికి తోడు ప్రతీ ఒక్క గ్రామంలో పోస్టాఫీసులు ఉండి వాటి పథకాలు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయి. కాని 5 ఏళ్లలో రూ.5 లక్షలు కావాలంటే ఎందులో ఇన్వెస్ట్‌ చేయాలో తెలుసుకోండి. మొదట ఐదేళ్ల పోస్టాఫీస్‌ టైమ్‌ డిపాజిట్‌ అకౌంట్‌ను ఎవరైనా ఓపెన్‌ చేయొచ్చు. దీంట్లో ఇద్దరు కలిసి జాయింట్‌గా అకౌంట్‌ కూడా తెరవచ్చు. అంతేకాక మైనర్‌ పేరు మీద కూడా ఈ అకౌంట్‌ తీసుకోవచ్చు. 10 ఏళ్ల వయస్సు కన్నా ఎక్కువ ఉన్నవాళ్లు సొంతంగా ఈ అకౌంట్‌ ఆపరేట్‌ చేయొచ్చు. 18 ఏళ్లు నిండిన తర్వాత అకౌంట్‌ను తప్పక కన్వర్ట్‌ చేయాల్సి ఉంటుంది. ఈ అకౌంట్‌ ఓపెన్‌ చేయడానికి రూ.200 చెల్లించాలి. ఈ ఖాతాలో రూ.200చొప్పున ఎంతైనా జమ చేయొచ్చు. వడ్డీని మూడు నెలలకోసారి లెక్కించి వార్షికంగా చెల్లిస్తారు. ఉదాహరణకు వడ్డీరేటు 7.8శాతం 3 నెలలకోసారి చక్రవడ్డీ లెక్కిస్తే మీ అకౌంట్‌లో 5 ఏళ్లలో రూ.5 లక్షలు జమ కావడానికి మీరు కనీసం రూ.3.4లక్షలు జమచేయాలి. ఎక్కువ మొత్తం ఒకేసారి డిపాజిట్‌ చేయలేనివాళ్లు రికవరింగ్ డిపాజిట్‌ తీసుకోవచ్చు. ఈ అకౌంట్‌ ఓపెన్‌ చేయడానికి రూ.10 చాలు. ఇందులో మీరు ఎంతైనా ఇన్వెస్ట్‌ చేయొచ్చు. వార్షిక వడ్డీరేటు 7.3శాతం 3 నెలలకోసారి చక్రవడ్డీ లెక్కిస్తే మీ అకౌంట్‌లో 5 ఏళ్లలో రూ.5లక్షలు జమ కావడానికి నెలకు రూ.6,900 చెల్లించాలి. 60ఏళ్లు దాటిన వృద్ధుల కోసం ఈ స్కీమ్‌ ఉపయోగపడుతుంది. గరిష్టంగా రూ.15లక్షల వరకు ఇన్వెస్‌ట చేయొచ్చు. వార్షిక వడ్డీ రేటు 7.8శాతం 3 నెలలకోసారి చక్రవడ్డీ లెక్కిస్తే మీ అకౌంట్‌లో 5 ఏళ్లలోరూ.5లక్షలు జమకావడానికి రూ.3.26లక్షలు జమచేయాలి.