మోదీ సినిమా రిలీజ్ డేట్‌ ఫిక్స్‌

SMTV Desk 2019-03-16 14:55:18  Modhi, modi movie

హైదరాబాద్ , మార్చ్ 16: భారత ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా ‘పీఎం న‌రేంద్ర మోదీ’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయింది. ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయ‌నున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తన్న ఈ సినిమాలో మోదీ పాత్రలో వివేక్ ఒబ‌రాయ్ న‌టిస్తున్నాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ముంబైలో చివ‌రి షెడ్యూల్ షూటింగ్ జ‌రుగుతుంది. మోదీ బాల్యం, ఆ త‌ర్వాత రాజ‌కీయ ప్ర‌వేశం గురించి ఫిల్మ్‌లో చూపించ‌నున్నారు. ఎక్కువ శాతం సినిమాను ఉత్త‌రాఖండ్‌లో షూట్ చేశారు. గుజ‌రాత్ సీఎం నుంచి 2014లో లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో మోదీ సృష్టించిన ప్ర‌భంజ‌నాన్ని కూడా ఫిల్మ్‌లో ప్ర‌జెంట్ చేయ‌నున్నారు. ఈ సినిమా పోస్ట‌ర్‌ను మొత్తం 27 భాష‌ల్లో రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే. ద‌ర్శ‌న్ కుమార్‌, బొమ‌న్ ఇరానీ, మ‌నోజ్ జోషీ, ప్ర‌శాంత్ నారాయ‌ణ‌న్‌, జ‌రీనా వాహ‌బ్‌, సేన్‌గుప్తాలు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టిస్తున్న‌ట్లు నిర్మాత సందీప్ సింగ్ తెలిపారు.