ఒడిశా ఛాయ్‌వాలాకు ప‌ద్మ‌శ్రీ

SMTV Desk 2019-03-16 13:42:03  ram nath kovind, president of india, padma shri award, odissa chai wala, d prakash rao

న్యూఢిల్లీ, మార్చ్ 16: శనివారం ఢిల్లీలో ప‌ద్మా అవార్డుల‌ను రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌దానం చేశారు. ఈ నేపథ్యంలో ఒడిశాకు చెందిన ఛాయ్‌వాలా డీ ప్ర‌కాశ్ రావు ప‌ద్మ‌శ్రీ అవార్డును అందుకున్నారు. క‌ట‌క్‌కు చెందిన ఛాయ్ అమ్మే ప్ర‌కాశ్ త‌న‌ సంపాదనలో వచ్చిన డబ్బుతో ఓ స్కూల్‌ను న‌డుపుతూ పేద పిల్ల‌ల‌కు ఉచిత విద్య‌ను అందిస్తున్నాడు. సామాజిక సేవ విభాగంలో ప్ర‌కాశ్ రావుకు ప‌ద్మ‌శ్రీ అవార్డు లభించింది. జాన‌ప‌ద గాయ‌ని తీజ‌న్ భాయ్‌, రామ్‌నాథ్ చేతుల మీదుగా ప‌ద్మ విభూష‌ణ్ అవార్డును తీసుకున్నారు. ప‌ద్మ భూష‌ణ్ అవార్డులను అందుకున్న‌వారిలో ఇస్రో శాస్త్ర‌వేత్త నంబి నారాయ‌ణ్‌, వాణిజ్య‌వేత్త మ‌హ‌స్య ధ‌ర్మ‌పాల గులాటీ, ప‌ర్వ‌తారోహ‌కురాలు బ‌చేంద్రి పాల్‌లు ఉన్నారు. ఇక ప‌ద్మ‌శ్రీ అందుకున్న‌వారిలో మాజీ క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ , హీరో మ‌నోజ్ బాజ్‌పాయి, త‌బ‌లా ఆర్టిస్ట్ స‌ప్నా చౌద‌రీ, ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ సునిల్ ఛ‌త్రి, ఆర్చ‌రీ క్రీడాకారిణి బంబేలా దేవి, ప‌బ్లిక్ అఫైర్స్‌లో హెచ్ ఎస్ ఫూల్కా, బాస్కెట్‌బాల్ ప్లేయ‌ర్ ప్ర‌శాంతి సింగ్‌లు ఉన్నారు.