కుటుంబం, సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతిఒక్కరూ చౌకీదారే : మోదీ

SMTV Desk 2019-03-16 13:41:01  narendra modi, bjp, loksabha elections

న్యూఢిల్లీ, మార్చ్ 16: భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశానికి తనతో పాటు చౌకీదారిగా ఉండే వారు దేశాభివృద్ధి, అవినీతిరహిత సమాజ కోసం పాటుపడాలని పిలుపునిచ్చారు. అలాగే కుటుంబం పట్ల, సమాజం పట్ల బాధ్యత ఉన్న ప్రతిఒక్కరూ చౌకీదారేనని అన్నారు. ఈ క్రమంలో ఆయన ట్విటర్ లో కార్యకర్తలకు సందేశమిచ్చారు. దేశం కోసం చౌకీదార్ గా తాను పని చేస్తున్నానని, తాను ఒంటరిని కాదని, యావత్ భారత ప్రజలు తనకు అండగా ఉన్నారని మోదీ తెలిపారు. ప్రతి ఒక్క భారతీయుడు చౌకీదారేనని ఆయన పేర్కొన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో చిత్తశుద్ధితో పని చేస్తున్న బిజెపి ప్రభుత్వాన్ని మళ్లీ అధికారంలోకి తేవాలని ఆయన ప్రజలను కోరారు. ఇదిలా ఉండగా తాను దేశానికి చౌకీదారినని ప్రధాని చాలా సందర్భాల్లో చెప్పుకున్న విషయం తెలిసిందే. అయితే చౌకీదార్ అన్న పదాన్ని వాడుతూ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మోడీపై చాలా సార్లు విమర్శలు చేశారు. రఫేల్ వివాదం విషయంలో మోడీపై రాహుల్ ఘాటైన విమర్శలు చేస్తూ చౌకీదారే దొంగ అంటూ పేర్కొన్నారు.