పెళ్ళైన మొదటి రోజే బావతో కలిసి భార్యపై అత్యాచారం చేసిన భర్త

SMTV Desk 2019-03-16 12:39:56  uttarpradesh, husband raped his wife

లక్నో, మార్చ్ 16: ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి పెళ్ళైన మొదటి రోజే భార్యపై బావతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాల ప్రకారం ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ 26 ఏళ్ల యువతికి ఇటీవల అదే నగరానికి చెందిన యువకునితో మార్చి 6న వివాహం జరిగింది. అదే రోజు రాత్రి నవ వధువు(26)పై బావతో కలిసి ఆమె భర్త అత్యాచారానికి పాల్పడ్డాడు. యువతిని తప్పించుకోవడానికి ప్రయత్నించగా తీవ్రంగా కొట్టి లైంగిక దాడికి పాల్పడ్డారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం యువతి స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.