ఆరుగురు పిల్లలు ఒకే కాన్పులో

SMTV Desk 2019-03-16 12:38:41  america, 6 Kids Born at one time in America

అమెరికా, మార్చ్ 16: అమెరికాలోని హ్యూస్టన్‌ నగరంలో ఓ మహిళా ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలకు జన్మనిచ్చింది. థెల్మా చియాకా అనే ఓ మహిళ శుక్రవారం ఒకే కాన్పులో ఇద్దరు ఆడపిల్లలు, నలుగురు మగ పిల్లలు జన్మించడంతో ఆమె సంతోషానికి హద్డుల్లేకుండా పోయింది. ఇటువంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం తల్లీ పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు వెల్లడించారు. ఆస్పత్రిలోని ప్రత్యేక విభాగంలో పిల్లల్ని వైద్యుల సంరక్షణలో ఉంచారు. ఇద్దరు ఆడ శిశువులకు జినా, జూరియెల్‌ అని పేర్లు పెట్టారు.