అండ‌మాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం

SMTV Desk 2019-03-16 12:36:52  andaman nicobar, earthquake

న్యూఢిల్లీ, మార్చ్ 16: శనివారం ఉదయం అండ‌మాన్ నికోబార్ దీవుల్లో భారీ భూకంపం వచ్చింది. రిక్ట‌ర్ స్కేల్‌పై భూకంప తీవ్ర‌త 4.7గా న‌మోదు అయిందని అధికారులు వెల్లడించారు. శనివారం ఉద‌యం 9.43 నిమిషాల‌కు భూమి కంపించిన‌ట్లు వారు తెలిపారు. ఈ భూకంపం వల్ల భారీగా ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. అయితే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.