త్వరలో జియో 5జి!

SMTV Desk 2019-03-16 12:33:07  reliance, reliance jio, mukhesh ambani, 5g service, airtel, idea, vodafone

మార్చ్ 16: టెలికాం రంగంల్లో దిగ్గజం రిలియన్స్ జియో నెట్‌వర్క్‌ అందుబాటులోకి 5జీ సేవలను తీసుకొని రావడానికి కసరత్తు చేస్తోంది. వొడాఫోన్‌, ఐడియా, ఎయిర్‌టెల్‌ల నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడానికి 2020 ద్వితీయార్ధంలో జియో 5జీ సేవలను తీసుకు రావడానికి చూస్తుంది. జియో5జి సేవల గురించి దీనిపై ముకేశ్ అంబానీ మాట్లాడుతూ..‘జియో నెట్‌వర్క్ ఇప్పటికి 280 మిలియన్ల మంది సభ్యులు వచ్చి చేరారు. ప్రపంచంలోని అతిపెద్ద మొబైల్‌ నెట్‌వర్క్స్‌లో జియో ఒక్కటిగా నిలిచింది. దేశంలోని ప్రజలకు జియో చాలా బాగా ఉపయోగపతుంది. దేశంలోని ప్రజలు జియోకు బాగా కనెక్ట్ అయ్యారు. ఇంతలా ఆదరించిన వినియోగదారులకు మరింత స్పీడుతో, నాణ్యతతో 5జీ సేవలను అందించడానికి కృషి చేస్తున్నాం. ప్రస్తుతం జియోలో నెలకొన్న కొన్ని సమస్యలను పరిష్కరించడంలో బిజీగా ఉన్నాం. దేశంలోని పరిస్థితులను కొద్ది రోజుల పాటు అధ్యయనం చేస్తాం. అక్కడ వచ్చే ఫలితాలను బట్టి ఒకేసారి 5జీ సేవలు ప్రారంభించాలా లేదా అనేది నిర్ణయిస్తాం’ అని తెలిపారు.