మిక్సీలో గ్రైండ్ చేసిన ఐఫోన్ మిశ్రమంతో శాస్త్రవేత్తల ప్రయోగం

SMTV Desk 2019-03-16 12:28:44  University of Plymouth, smartphone, apple iphone,

బ్రిటన్, మార్చ్ 16: బ్రిటన్ పాలి‌మౌత్ యూనివర్సిటీకి చెందిన కొంతమంది శాస్త్రవేత్తలు ఓ కొత్త ప్రయేగం చేశారు. మిక్సీలో ఆపిల్ ఐఫోన్ ను వేసి గ్రైండ్ చేసిన తర్వాత ఆ మిశ్రమానికి కెమికల్ టెస్ట్ నిర్వహించారు. ఈ మిశ్రమం అరుదైన మూలకాలను గుర్తించేందుకు ఉపయోగపడుతుందని, దీని ద్వారా రీసైక్లింగ్ అవకాశాలను కూడా మెరుగు పరుచొచ్చని శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ప్రయోగంలో భాగంగా ఆ ఐఫోన్ మిశ్రమంలో 33గ్రా. ఐరన్, 13 గ్రా. సిలికాన్, 7గ్రా. క్రోమియం, 90 మి.గ్రా సిల్వర్, 36మి.గ్రా బంగారం ఉన్నట్లు తేలిసింది. శాస్త్రవేత్తలు జరిపిన ప్రయోగంలో 900మి.గ్రా టంగ్‌స్టన్, 70మి.గ్రా కోబాల్ట్, 160మి.గ్రా నియోడిమియం, 300మి.గ్రా ప్రసియోడిమియం వంటి అసాధారణ మూలకాలను గుర్తించారు. దీనిపై బ్రిటన్ పాలిమౌత్ వర్సటీ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ. ‘ప్రయోగం చేయడం కోసం మిక్సీలో గ్రైండ్ చేసిన స్మార్ట్ ఫోన్ మిశ్రమాన్ని 500 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద శక్తివంతమైన ఆక్సిడైజర్, సోడియం పెరాక్సైడ్ రసాయనాలతో కలిపాం. దీని ద్వారా స్మార్ట్ ఫోన్ లోని రసాయనిక మూలకాల గురించి అన్ని వివరాలు తెలుసుకోగలిగాం’ అని పేర్కొన్నారు.