కరీంనగర్ లో భారీ కుంభకోణం

SMTV Desk 2019-03-16 10:51:09  karimnagar, union bank of india, scam

కరీంనగర్, మార్చ్ 15: కరీంనగర్ జిల్లాలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖలో ఓ భారీ కుంభకోణం బయటపడింది. పూర్తి వివరాల ప్రకారం ఆ బ్యాంకులో చెస్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్న సురేశ్ కుమార్ ప్రైవేట్ వ్యక్తులకు దాదాపు రూ.12 కోట్ల డబ్బును అప్పుగా ఇచ్చాడని ఉన్నతాధికారుల తనిఖీల్లో వెల్లడైంది. దీంతో సురేశ్ కుమార్‌తో పాటు మరో ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసును సీబీఐకి బదిలీ చేస్తామని కరీంనగర్ పోలీసులు తెలిపారు. ఇప్పటికే వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ, ఐపీఎల్ సిద్ధాంతకర్త లలిత్ మోదీ, లిక్కర్ కింగ్ విజయ మాల్యా తదితర బడా వ్యాపారులు దేశీయ బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయలు అప్పు తీసుకుని విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే. ఈ కుంభకోణాలు ఇలాగే కొనసాగితే బ్యాంకులపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతుందని పలువురు ఆర్థిక నిపుణులు తెలుపుతున్నారు. ఈ తరహా ఆర్థిక నేరగాల్లాకు కఠిన శిక్షలు విధించి ప్రజలకు బ్యాంకులపై ఉన్న నమ్మకాన్ని పునరుద్దరించాలని కోరుతున్నారు.