మన భవిష్యత్ దానిపైనే ఆధారపడి ఉంది : రతన్

SMTV Desk 2019-03-16 10:46:45  ratan tata, tata, loksabha elections, election commission of india

ముంబయి, మార్చ్ 15: రానున్న ఎన్నికల్లో ప్రతీ ఒక్కరు తమ ఓటును వినియోగిన్చుకోవాల్సిందిగా ఎన్నికల సంఘం, దేశ ప్రముఖులకు పిలునిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ ఓటు ప్రాముఖ్యతను తెలియజేస్తూ ట్విట్టర్ ద్వారా స్పందించారు. ఓటేయడం ప్రతి పౌరుడి అత్యంత శక్తివంతమైన హక్కు అన్నారు. అంతేకాకుండా అది మన బాధ్యతన్నారు. దయచేసి అందరూ ఓటేయండి. మన భవిష్యత్ దానిపైనే ఆధారపడి ఉందని ఆయన పేర్కొన్నారు.