బోయింగ్‌కు భారీ నష్టం

SMTV Desk 2019-03-15 18:38:56  boing 737 max, boing, america president, donlad trump

న్యూయార్క్‌, మార్చ్ 15: ఇండోనేషియా, ఇథియోపియాలో జరిగిన బోయింగ్ 737 విమాన ప్రమాదాల వల్ల ప్రపంచ వ్యాప్తంగా వివిధదేశాల్లో విమానాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 25 బిలియన్‌ డాలర్ల కంపెనీ మార్కెట్‌ విలువలు నష్టపోయినట్లు తేలింది. అమెరికా కూడా ఈ విమానాలను నిలిపివేయాలన్న నిర్ణయానికి రావడంతో మొత్తం కంపెనీ షేర్లు మరో మూడుశాతం క్షీణించాయి. అంతేకాక అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్‌ ట్రంప్‌ కూడా శ్వేతసౌధం నుంచే ఈ నిర్ణయాన్ని ప్రకటించడం కంపెనీని మరింత దెబ్బ తీసింది. విమాన ప్రమాదంనుంచి కంపెనీ స్టాక్‌సుమారు పదిశాతం అంటే దాదాపు 25 బిలియన్‌ డాలర్లుమేర నష్టం జరిగిందని అంచనా. ఇప్పటివరకూ ఈ మూడుసంస్థల్లో సుమారు 67 విమానాలు 737 మాక్స్‌ విమానాలు నిర్వహించిన సందర్భాలున్నాయి. ఏవియేషన్‌ అధికారులు కూడా ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్‌ విమానాలకు ఆర్డర్లివ్వడం నిలిపివేసారు. దీనితో బోయింగ్‌సంస్థ తనవంతు జాగ్రత్తలు తీసుకుంటున్నది. విమానాలభద్రతపై ఇపుడు దృష్టికేంద్రీకరించింది. నష్టనివారణ చర్యలను ప్రారంబించింది.