భారతదేశ వ్యవసాయంలో ఆరితేరిన విదేశీయుడు

SMTV Desk 2019-03-15 18:36:35  puduchherry, united kingdom, indian agriculture, krishna mekanji

పుదుచ్చేరి, మార్చ్ 15: భారతదేశంలో వ్యవసాయం చేయడంలో యునైటెడ్‌ కింగ్‌డమ్‌ కు చెందిన ఓ విదేశీయుడు ఆరితేరాడు. పుదుచ్చేరి రాష్ట్రంలో సేంద్రియ వ్యవసాయంలో పట్టు సాధించాడు. తమిళులులకు పోషకాహారంపై వారికి ఉన్న మక్కువ తనను సేంద్రీయ సాగులో రాణించేందుకు ప్రోత్సహించిందంటున్నారు. గత 26 ఏళ్లుగా ఇక్కడే స్థిర నివాసం ఏర్పరుచుకున్న కృష్ణ మెకంజీ ఇంగ్లాండ్ ప్రజలకు, వారు తింటున్న ఆహారం ఎక్కడి నుంచి ఎలా వస్తుందో కూడా తెలియదన్నారు. అయితే సేంద్రీయ పంటలు పండిస్తున్న కృష్ణ మెకంజీ.. వాటితోనే హోటల్ కూడా నిర్వహిస్తూ.. ప్రజలకు మంచి ఆహారాన్ని అందిస్తున్నారు.