వరల్డ్‌కప్‌ తర్వాత వన్డే కెరీర్‌కు గుడ్‌బై

SMTV Desk 2019-03-15 18:35:48  southafrica, jp dumini, odi, world cup, JP Duminy,

సౌతాఫ్రికా, మార్చ్ 15: సౌతాఫ్రికా జట్టు ఆటగాడు జెపి డుమిని 2019 వరల్డ్‌కప్‌ తర్వాత వన్డే కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ప్రకటించాడు. టెస్ట్‌, ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించుకుని, అప్పటి నుంచి పరిమిత ఓవర్ల క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. 2011, 2015 వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికాకు ప్రాతినిథ్యం వహించిన డుమిని ఈ సారి కూడా బరిలోకి దిగేందుకు సిద్దమయ్యాడు. ఇక శ్రీలంకతో ఆఖరి ఐదో వన్డే శనివారం న్యూలాండ్స్‌ వేదికగా జరగనుంది. సొంతగడ్డపై డుమినికి ఇదే ఆఖరి మ్యాచ్‌ అవుతుంది. 2019 ఐపిఎల్‌ వేలానికి ముందు ముంబై ఇండియన్స్‌ జట్టు జెపిని విడుదల చేయగా అతన్ని ఏ ఫ్రారఛైజీ కొనుగోలు చేయలేదు.