నీరవ్ మోడీకి గోల్డెన్ వీసా

SMTV Desk 2019-03-15 17:25:59  neerav modi, golden visa, Britain government

బ్రిటన్‌, మార్చ్ 15: ఇండియాలో వేల కోట్ల అప్పులతో బ్యాంకులను మోసం చేసిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి బ్రిటన్‌ సర్కార్‌ తాజాగా గోల్డెన్ వీసా జారీ చేసింది. యూకే ప్రభుత్వ కంపెనీల్లో బాండ్లు, షేర్లలో 2 మిలియన్ ల పౌండ్లను పెట్టుబడిగా పెట్టే విదేశీయులకు గోల్డెన్ ఇన్వెస్టర్ వీసాను జారీ చేస్తుంది. ఇక సెంట్రల్ పాయింట్ లండన్ అపార్టుమెంట్ లో ఉంటూ అక్కడ వజ్రాల వ్యాపారం చేస్తున్న నీరవ్ మోడీకి భారత పాస్ పోర్టుపై గోల్డెన్ వీసాను మంజూరు చేసింది. ఇదిలా ఉంటే పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణంలో గత ఏడాది నవంబరులో ఇంటర్ పోల్ నీరవ్ కి రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసింది.