స్టాక్ మార్కెట్ : శుక్రవారం కూడా లాభాలే

SMTV Desk 2019-03-15 17:24:13  Stack market, Sen sex, Shares

ముంబై, మార్చ్ 15: ఈ రోజు కూడా దేశీ స్టాక్ మార్కెట్ లాభాల్లో ట్రేడ్ అయ్యింది. గత నాలుగు రోజులుగా పెరుగుతూ వచ్చిన స్టాక్ మార్కెట్ శుక్రవారం కూడా అదే ట్రెండ్ను అనుసరించింది. సెన్సెక్స్‌ 269 పాయింట్ల లాభంతో 38,024 పాయింట్ల వద్ద, నిఫ్టీ 84 పాయింట్ల లాభంతో 11,427 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి. అలాగే నిఫ్టీ 50లో కోటక్ మహీంద్రా బ్యాంక్, ఐఓసీ, హెచ్‌పీసీఎల్, పవర్ గ్రిడ్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, యూపీఎల్, గెయిల్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు కూడా లాభాల్లో ముగిశాయి. టీసీఎస్ 2 శాతానికి పైగా పెరిగింది. అదే సమయంలో హెచ్‌యూఎల్, యస్ బ్యాంక్, రిలయన్స్, ఐటీసీ, భారతీ ఎయిర్‌టెల్, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, హిందాల్కో, టాటా స్టీల్, హీరో మోటొకార్ప్ షేర్లు నష్టా్ల్లో ముగిశాయి. రిలయన్స్, ఐటీసీ షేర్లు 1 శాతానికి పైగా పడిపోయాయి. హెచ్‌యూఎల్ 2 శాతానికి పైగా నష్టపోయింది.