పేటీఎం ఖాతాదారులకు శుభవార్త : త్వరలో పేటీఎం నుండి మొబైల్ బ్యాంకింగ్ యాప్‌

SMTV Desk 2019-03-15 17:16:27  paytm, paytm payments bank app

మార్చ్ 15: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ తాజాగా తమ ఖాతాదారుల కోసం మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను ఆవిష్కరించింది. దీని సాయంతో అకౌంట్ బ్యాలెన్స్ వివరాలు, డెబిట్ కార్డు కోసం రిక్వెస్ట్ పంపడం, డిజిటల్ డెబిట్ కార్డు యాక్సెస్ వంటి తదితర సేవలు పొందొచ్చు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలు 2017లో ప్రారంభమయ్యాయి. బ్యాంక్‌కు ప్రస్తుతం 4.3 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. బ్యాంక్ ఇప్పటికే 20 లక్షలకు పైగా డెబిట్ కార్డులను జారీ చేసింది. అలాగే బ్యాంక్ తన కస్టమర్లందరికీ వర్చువల్ డెబిట్ కార్డులను ఇష్యూ చేసింది. మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ వల్ల 4.3 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం కలుగుతుందని పేటీఎం పేమెంట్స్‌ బ్యాంకు మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీఈవో సతీష్‌ కుమార్‌ గుప్తా తెలిపారు. మొబైల్ బ్యాంకింగ్ యాప్‌తో వారంలో ఏడు రోజులూ బ్యాంక్ సేవలు పొందొచ్చని పేర్కొన్నారు. కాగా పేటీఎం మొబైల్ బ్యాంకింగ్ యాప్ త్వరలో గూగుల్ ప్లేస్టోర్‌లో అందుబాటులోకి రానుంది.