మసూద్ అజర్‌ ఆస్తులు జప్తు

SMTV Desk 2019-03-15 17:15:26  jaish e Chief Masood Azhar, pakistan, india, pulwama attack, uno, france, china

ఫ్రాన్స్, మార్చ్ 15: జైషే మహ్మద్ అధినేత మసూద్ అజర్‌పై చర్యలకు ఐరాస భద్రతా మండలి సభ్య దేశం ఫ్రాన్స్ సిద్దమయ్యింది. ఈ నేపథ్యంలో మసూద్ అజర్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. మసూద్ ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలి అని ప్రతిపాదనను తీసుకొచ్చిన దేశాల్లో ఫ్రాన్స్ ఒకటి. అయితే ఈ ప్రతిపాదనను చైనా అడ్డుకుంటున్న సంగతి తెలిసిందే. మసూద్ అజర్‌ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని అమెరికా చైనాను ఇప్పటికే హెచ్చరించింది. అమెరికాకు ఫ్రాన్స్ తోడైంది. ఉగ్రవాదంతో సంబంధం ఉన్న వ్యక్తులతో యురోపియన్ యూనియన్ ఓ జాబితాను తయారు చేస్తోంది. ఈ జాబితాలో మసూద్ పేరును చేర్చే అంశంపై చర్చిస్తామని ఫ్రాన్స్ అంతర్గత మంత్రిత్వ శాఖ, ఆర్థిక శాఖ, విదేశాంగ శాఖలు వెల్లడించాయి.