40 లక్షల పన్ను ఎగవేసిన జగన్ కంపెనీ

SMTV Desk 2017-08-08 17:39:30  Jagan, CAG, Bharathi cements, New delhi, Income tax

న్యూఢిల్లీ, ఆగష్ట్ 8: ఇటీవల కాలంలో కాగ్ పన్ను ఎగవేత దారుల భరతం పట్టే పనిలో నిమగ్నమైంది. దీనిలో భాగంగా కొందరు ప్రముఖులకు నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా 2012 నుంచి 2015-16 ఆర్థిక సంవత్సరాల మధ్య వివిధ కంపెనీల ఆదాయపు పన్ను చెల్లింపు వివరాలపై కాగ్ తయారు చేసిన నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలను అడ్డం పెట్టుకుని కంపెనీలు ఆదాయపు పన్ను ఎగవేస్తున్నాయని కాగ్ తన నివేదికలో తెలిపింది. ఈ కంపెనీల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. వీటిలో వైసీపీ అధినేత జగన్‌కు చెందిన భారతీ సిమెంట్ కంపెనీ కూడా ఉండటం విశేషం. భారతీ సిమెంట్ సంస్థకు చెందిన కొన్ని ఆస్తులు చట్టపరమైన చిక్కుల్లో ఉన్నాయంటూ కొంత ఆదాయాన్ని తన లాభాల్లో చూపించలేదు. దీంతో రూ. 40.63 లక్షల పన్నును ఆ కంపెనీ ఎగవేసినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది. అలాగే సోమా ఎంటర్ ప్రైజెస్ రూ.20.05 కోట్లు, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్‌ రూ. 20.31కోట్లు పక్కదారి పెట్టించినట్లు కాగ్ తెలిపింది.