మాతే మహాదేవి కన్నుమూత

SMTV Desk 2019-03-15 14:23:02  Basava Dharma Peetha , Mate Mahadevi, Seer Mate Mahadevi, agadguru Mate Mahadevi

బెంగాళూరు, మార్చ్ 15: లింగాయత్‌, బసవధర్మ పీఠం అధ్యక్షురాలు మాతే మహాదేవి (74) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మార్చి 9న ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చేరారు. అయితే అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు ఆసుపత్రి యాజమాన్యం వెల్లడించింది. మహాదేవి మృతిపట్ల లింగాయత్ పెద్దలు, కులస్తులు సంతాపం ప్రకటించారు. ఆమె అంత్యక్రియలు ఈ రోజు కర్ణాటకలోని చిత్రదుర్గలో జరిగాయి.