మోదీ ట్వీట్...రోహిత్ రీట్వీట్

SMTV Desk 2019-03-15 14:22:11  indian prime minister, narendra modi, loksabha elections, rohit sharma

న్యూఢిల్లీ, మార్చ్ 15: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రతీ భారతీయుడు తన ఓటు హక్కు విలువను తెలుసుకొని తమ ఓటును వినియోగించుకోవాలని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ట్విట్టర్ వేదికగా వరుస ట్వీట్లు చేస్తూ రాజకీయ, సినీ, క్రీడా ప్రముఖులకు మోడి విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే భారత జట్టు ఆటగాడు రోహిత్ శర్మకు కూడా ట్వీట్ చేశారు. అయితే దీనిపై స్పందించిన రోహిత్ ‘మన భవిష్యత్తు మంచిగా ఉండాలంటే.. మన దగ్గర ఉన్న అతిపెద్ద ఆయుధం ఓటు అని, ఓటు వేయడాన్ని అందరు బాధ్యతగా భావించాలని’ హిట్‌మ్యాన్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.