లాభాల్లో ఇండియన్ రూపాయి

SMTV Desk 2019-03-15 14:18:36  indian currency, rupee, trade, shares, america dollar value

న్యూఢిల్లీ, మార్చ్ 15: గత కొంత కాలంగా తగ్గుతూ వచ్చిన భారతదేశ రూపాయి విలువ గత ఐదు రోజుల నుండి బలపడుతూ వస్తోంది. ఈ రోజు కూడా ఇదే రీతిలో ట్రెండ్ నమోదయ్యింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి లాభపడటం ఇది వరుసగా ఐదో రోజు. ఉదయం 9:15 సమయంలో రూపాయి 69.22 వద్ద ట్రేడవుతోంది. గురువారం నాటి ముగింపు 69.35తో పోలిస్తే 0.12 శాతం పెరిగింది. 2018 ఆగస్ట్ 10 నుంచి చూస్తే రూపాయి ఈ స్థాయిని అందుకోవడం ఇదే తొలిసారి. ఈ ఏడాది ఇప్పటి దాకా చూస్తే రూపాయి 0.8 శాతం మేర లాభపడింది. విదేశీ ఇన్వె్స్టర్లు 4.45 బిలియన్ డాలర్లు ఈక్విటీ మార్కె్ట్‌లో ఇన్వె్స్ట్ చేశారు.