మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు

SMTV Desk 2019-03-15 12:14:47  jammukashmir, terrorist, avantipora, guljarpora

జమ్ముకాశ్మీర్, మార్చ్ 15: అవంతిపొరాలోని గుల్జార్‌పొరాలో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పోలీసు ఇన్ ఫార్మర్ అని ఇంట్లో నిద్రిస్తున్న అతన్ని కిడ్నాప్ చేసి కాల్చి చంపారు. కాగా మృతుడు దొగ్రిపొరాకు చెందిన మంజూర్ అహ్మద్ లోన్‌గా పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం కోసం మంజూర్ అహ్మద్ లోన్‌ మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలీసులు ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భారీ ఎత్తున కూంబింగ్ చేపట్టారు. మంజూర్ అహ్మద్ లోన్‌ హత్యతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు.