ఆసియా క్రీడల్లో చెస్

SMTV Desk 2019-03-15 11:50:23  asia sports, chess medal event,

న్యూఢిల్లీ, మార్చ్ 15: నాలుగేళ్లకు ఒకసారి జరిగే ఆసియా క్రీడల్లో చెస్‌ మెడల్‌ ఈవెంట్‌ను మళ్ళీ పునరాగమనం చేయనున్నారు. 2006 ధోహా 2010 గ్యాంగ్‌జూ ఆసియా క్రీడల్లో పతకాంశంగా ఉన్న చెస్‌ను 2014, 2018 సంవత్సరంలో జరిగిన క్రీడల్లో చెస్ ను నిర్వహించలేదు. అయితే 2022లో చైనాలోని హౌంగ్జౌలో జరిగే ఆసియా క్రీడల్లో చెస్‌ను మళ్లీ ప్రవేశపెడుతున్నట్లు ఈ క్రీడల నిర్వాహక కమిటీ అధికారికంగా ఆసియా చెస్‌ సమాఖ్యకు సమాచారం ఇచ్చింది. 2022లో సెప్టెంబర్‌ 10 నుంచి 25 వరకు ఆసియా క్రీడలు జరుగుతాయి.