మసీదులో కాల్పులు...ఆరుగురు మృతి...50 మందికి గాయాలు

SMTV Desk 2019-03-15 11:49:25  newzealand, central christchurch, masjeed, gun firing, 6men died, Christchurch mosque shooting

వెల్లింగ్టన్‌, మార్చ్ 15: శుక్రవారం ఉదయం న్యూజిలాండ్‌ సెంట్రల్ క్రైస్ట్‌చర్చ్‌ నగరంలోని ఓ మసీదులో దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ సంఘటనలో ఆరుగురు అక్కడే చనిపోగా మిగితా 50 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ దుండగుడు కాల్పులు జరుపుతున్న సమయంలో పోలీసులు ఎదురు కాల్పులు చేశారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో ఆ దుండగుడు మరణించాడు. అలాగే ఆ ప్రదేశంలోని చుట్టు పక్కల ప్రజలు బయటకు రావద్దని పోలీసులు హెచ్చరించారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు చేపట్టారు. బాధితుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.