విక్రయానికి పెట్టిన అంబాని కీలక ఆస్తులు

SMTV Desk 2019-03-15 11:44:52  reliance infrastructure, anil ambani, delhi, agra tolgate way, cube high way

ముంబై, మార్చ్ 15: అనిల్ అంబానికి సంబంధించిన రిలియన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఆగ్రా టోల్ రోడ్‌వేలో మొత్తం వాటాను సింగపూర్‌కు చేందిన క్యూబ్‌ హైవేకు రూ.3,600 కోట్లకు విక్రయించనున్నట్లు ప్రకటించింది. దీంతో కంపేనీ అప్పు 25శాతం తగ్గి రూ.5వేల కోట్ల లోపు ఉంటుంది. ఇదివరకే రిలయన్స్‌ ఇన్‌ఫ్రా క్యూబ్‌ హైవేస్‌తో ఒప్పందం కూడా చేసుకొంది. ఈ ఒప్పందం ప్రకారం ఢిల్లీ ఆగ్రా టోల్‌రోడ్‌లో 100శాతం వాటాను విక్రయించనుంది. మొత్తం 180 కిలోమీటర్ల ఢిల్లీ ఆగ్రా హైవేను ఆర్‌ ఇన్‌ఫ్రా చెందిన డీఏ టోల్‌ రోడ్‌ సంస్థ మొత్తం 180 కిలోమీటర్ల మేర నిర్వహిస్తోంది.