జగన్ పై మండిపడ్డ పవన్ కళ్యాణ్

SMTV Desk 2019-03-15 11:13:34  Jagan, Pawan kalyan,

అమరావతి , మార్చ్ 15: రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ దినోత్సవ సభ సందర్బంగా వైసీపీ అధినేత జగన్ పై జనసేనాని పవన్ కళ్యాణ్ నిప్పులు చెరిగారు. తాను జగన్ ను పాలసీల పరంగా విమర్శిస్తుంటే జగన్ మాత్రం వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని అన్నారు, తనను ఏమీ అనలేక ఇలా వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని మండి పడ్డారు. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయటానికి “వేల కోట్లు దోచామా?, కులాల పేరుతో వేరు చేశామా?, కుటుంబ పాలన చేశామా?” అని ప్రశ్నించారు పవన్ కళ్యాణ్, తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలున్నాయని జగన్ కు ఏం తెలుసని ప్రశ్నించారు.

బీసీ కులాల పేరిట ప్రత్యేకంగా సభలు పెట్టి వారికోసం వరాలు కురిపించటం తనకు చేతకాదని అన్నారు, జనసేన బీసీ సభలు వంటివి పెట్టదని స్పష్టం చేసారు. జనసేన ప్రకటించిన 32మంది అభ్యర్థుల జాబితాలోని బీసీలకు అండగా ఉన్నామని అన్నారు. ఈ సందర్బంగా జగన్ కు సవాల్ విసిరారు పవన్ కళ్యాణ్, కడప పార్లమెంట్ సీటును బీసీ అభ్యర్థికి ఇవ్వగలరా?, పులివెందుల అసెంబ్లీ సీటుకు బీసీ అభ్యర్థిని నిలబెట్టగలరా?, జగన్ తన కుటుంబాన్ని కాదని ఇతరులకు ఎందుకు సీటివ్వలేరని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.