వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై అనుమానాలు

SMTV Desk 2019-03-15 11:12:26  YS Vivekananda reddy,

అమరావతి , మార్చ్ 15: : వైసీపీ అధినేత జగ‌న్ మోహ‌న్ రెడ్డి బాబాయి వైెస్ వివేకానందరెడ్డి ఈరోజు గుండె పోటుతో మ‌రణించిన సంగ‌తి తెలిసిందే. కొంత కాలంగా అనారోగ్యంగా బాధ ప‌డుతున్న వివేకానంద‌రెడ్డి తెల్ల‌వారుజామున పులివెందుల‌లోని త‌న స్వ‌గృహంలో మృతి చెందారు.

దీంతో వైఎస్ కుటుంబీకులు మొత్తం విషాదంలో మునిగి తేల‌గా, వివేక రక్తపు మడుగులో పడివుండటం, తల, చేతిపై బలమైన గాయాలు ఉండటం ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఇయన ఇంటిని డాగ్‌స్వ్కాడ్ సాయంతో తనిఖీలు ముమ్మరం చేసారు. మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది