2019లో ముఖ్యమంత్రి కాబోతున్న : పవన్ కళ్యాణ్

SMTV Desk 2019-03-15 09:54:08  Pawan kalyan, Jansena,

రాజమండ్రి, మార్చ్ 15: : కానిస్టేబుల్‌ ఇంట్లో పుట్టిన ఓ వ్యక్తి 2019లో ముఖ్యమంత్రి కాబోతున్నారని జనసేన అధినేత పవన్‌‌కల్యాణ్ అన్నారు. గురువారం రాజమండ్రిలో జనసేన ఆవిర్భావ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేయబోతున్నామని స్పష్టం చేశారు. అన్యాయంపై గళమెత్తేందుకే రాజకీయాల్లోకి వచ్చానని, తెలుగు ప్రజల సుస్థిరత కోసమే గతంలో బిజెపి, టిడిపికి మద్దతిచ్చానని చెప్పారు.

డబ్బుంటే చాలు గెలవొచ్చనే పరిస్థితుల్లో ఉన్నామని.. డబ్బు, పేరు తనకు ఎప్పుడూ ఆనందం ఇవ్వలేదని చెప్పారు. మనిషికి అన్యాయం జరుగుతుంటే వర్గీకరించి చూడలేనన్నారు. గెలుపోటములు తెలియదు… యుద్ధం చేయడమే తెలుసన్నారు. సీఎం పదవిపై తనకు కోరిక లేదని, అందలం ఎక్కాలని ఆశ లేదన్నారు. పవర్‌స్టార్‌ పదంపైనే ఆసక్తి లేదని.. అలాంటిది సిఎం పదవిపై ఉంటుందా అని ప్రశ్నించారు. రాజకీయాల్లో నాకు శత్రులెవరూ లేరని, వైసిపి అధినేత జగన్‌ విధానాలను ప్రశ్నిస్తే నాపై వ్యక్తిగత దాడి చేస్తున్నారని పవన్‌ ఆరోపించారు.