లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ పై క్లారిటీ ఇచ్చిన ఈసీ !

SMTV Desk 2019-03-15 09:53:18  Laksmis NTR, movie, ram gopal varma,

హైదరాబాద్, మార్చ్ 15: సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పెద్దాయన ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీయార్. నటుడు బాలకృష్ణ తన తండ్రి జననం నుండి, తన తల్లి మరణం వరకు జరిగిన పరిణామాలు అన్నీ కలుపుతూ తన తల్లితండ్రుల కధ అని చెబుతూ కధానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు సినిమాలు విడుదల చేశారు. అయితే అవి అనుకున్నత విజయం సాదించలేకపోయాయి. ఈ నేపధ్యంలో వర్మ తీసుతున్న సినిమా మీదే అన్ద్దరి దృష్టి నెలకొని ఉంది. అదీ కాక తన టీజర్, ట్రైలర్స్ తో మరింత ఇంటరెస్ట్ పెంచేస్తున్నాడు వర్మ. అయితే వెన్నుపోటు లాంటి విషయాలను డైరెక్ట్ గా ప్రస్తావించడంతో తెలుగుదేశం నేతలు వర్మ మీద ఫైర్ అవుతున్నారు. తాజాగా ఎన్నికల ముంగిట రిలీజ్ ఆపాలని కోరుతూ ఎన్నికల సంఘం తలుపు కూడా తట్టారు. అయితే ఎవరు ఎన్ని ప్రయత్మలు చేసినా సినిమా ఆగదని వర్మ చెబుతున్నారు. ఈ సమయంలో వర్మకి కాస్త ఉపశమనం లభించేలా కొన్ని వ్యాఖ్యలు చేసింది ఎలక్షన్ కమిషన్. లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాని ఎన్నికల సమయంలో బ్యాన్‌ చేయాలని ఫిర్యాదు అందిందని, కానీ మాకున్న రూల్స్‌ ప్రకారం సినిమా విడుదలను ఆపడం సాధ్యం కాదని తెలంగాణా ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్. ఒకవేళ సినిమా పార్టీని కించపరిచే విధంగా ఉందని తెలిస్తే కేసులు నమోదు చేస్తామని అది కూడా తాము చేయమని కేంద్ర ఎన్నికల సంగానికి తాము నివేదిక ఇస్తే వారు జరగాల్సింది చూసుకుంటారని రజత్‌ కుమార్‌ పేర్కొన్నారు.