ముగిసిన అభినందన్ విచారణ

SMTV Desk 2019-03-15 09:52:30  Abhinandan,

హైదరాబాద్, మార్చ్ 15: వింగ్ కమాండర్ అభినందన్ విచారణ పూర్తయింది. ఐఏఎఫ్‌, ఎన్‌ఐఏ అధికారులు దాదాపు 13రోజుల పాటు అభినందన్‌ ను విచారించారు. విచారణ పూర్తి కావడంతో ఆర్మీ రీసర్చ్ అండ్ రెఫరల్ ఆసుపత్రి వైద్యుల సూచన మేరకు కొన్ని వారాల పాటు సిక్ లీవ్ పై వెళ్తున్నారు అభినందన్. పాకిస్థాన్‌ నుంచి భారత్‌ తిరిగొచ్చాక మార్చి 3న వింగ్‌ కమాండర్‌ కు ఆర్మీ డాక్టర్లు ఎంఆర్ఐ స్కాన్ చేశారు. అతని శరీరంలో పాక్ ఆర్మీ ఎలాంటి బగ్స్ అమర్చలేదని నిర్ధారించారు. విమానం నుంచి పారాచూట్ సహాయంలో ల్యాండ్ అయిన సందర్భంలో వెన్నుపూసకు, పక్కటెముకకు గాయాలు అయినట్టు గుర్తించారు.