వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డి హఠాన్మరణం

SMTV Desk 2019-03-15 09:46:52  Vevikananda reddy,

పులివెందుల, మార్చ్ 15: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. వైఎస్సార్‌ సోదరుడు, మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి(68) కన్నుమూశారు. శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో వైఎస్‌ వివేకానందరెడ్డి పులివెందులలో తుదిశ్వాస విడిచారు. ఆయన అకాల మరణం వైసీపీ శ్రేణులను దిగ్ర్భాంతికి గురిచేసింది. గతంలో కడప నుంచి లోక్ సభకు వివేకా ప్రాతినిథ్యం వహించారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో వ్యవసాయ మంత్రిగా పని చేశారు.