షమీపై మరోకేసు పెట్టిన భార్య హసీన్ జాహన్‌

SMTV Desk 2019-03-15 09:41:47  Mohammed Shami, Hasin Jahan, cricketer, model, ipl season 2018, ipl 2019

న్యూఢిల్లీ, మార్చ్ 14: భారత్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మళ్ళీ చిక్కులో ఇరుక్కున్నాడు. సరిగ్గా గతేడాది ఐపీఎల్ సీజన్ ముందు షమీపై హత్యాయత్నం, గృహహింస‌ కేసులు పెట్టిన భార్య హసీన్ జాహన్‌ మళ్ళీ ఈ ఏడాది సీజన్ ముందు తాజాగా వరకట్నం వేధింపుల కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు షమీపై ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. గత ఏడాది ఐపీఎల్‌కి ముందు ఇద్దరి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో అతనితో విడిపోయిన హసీన్ జాహన్.. షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కి పాల్పడుతున్నాడని, పాక్‌ మహిళతో అతనికి అక్రమ సంబంధం ఉందని ఆరోపణలు గుప్పించింది. కానీ.. షమీపై ప్రత్యేకంగా విచారణ జరిపిన బీసీసీఐ ఆ తర్వాత క్లీన్‌చిట్ ఇచ్చింది. దీంతో.. గత ఏడాది ఈ ఫాస్ట్ బౌలర్ టోర్నీ ఆడగలిగాడు.