స్కూల్ భవనం కుప్పకూలి 10 మంది విద్యార్థులు మృతి 100 మందికి పైగా గల్లంతు

SMTV Desk 2019-03-15 09:38:32  Nigeria school collapse, Lagos building disaster leaves 10 dead, Dogara mourns pupils

లాగోస్‌, మార్చ్ 14: నైజీరియా వాణిజ్య రాజధాని లాగోస్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లాగోస్‌లోని ఇటా-ఫాజి ప్రాంతంలో మూడంతస్తుల స్కూల్ భవనం కుప్పకూలి 10 మంది విద్యార్థులు చనిపోయారు. ఈ దుర్ఘటనలో మరో 100 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకున్నారు. ఇప్పటికి దాదాపు 40 మంది విద్యార్థులను శిథిలాల కింద నుంచి రెస్క్యూ సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిగిలిన విద్యార్థులను కూడా రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. గాయపడ్డవారిని వెంటనే ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై నైజీరియా అధ్యక్షుడు ముహమ్మద్ బుహారీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని..గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.