కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి .. తెరాసలోకి

SMTV Desk 2019-03-14 18:12:53  Congres MLA, upender reddy,

హైదరాబాద్, మార్చ్ 14: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కురుక్షేత్రయుద్ధంలో కర్ణుడి పరిస్థితిలా ఉందని చెప్పవచ్చు. లోక్‌సభ ఎన్నికల కురుక్షేత్రంలో యుద్ధానికి సిద్దమవ్వాలో లేక పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కాపాడుకోవాలో తెలియని స్థితిలో ఉందిప్పుడు.

తాజాగా పాలేరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తెరాసలో చేరిపోతున్నానని ప్రకటించేరు. విశేషమేమిటంటే ఆయన మాజీ మంత్రి, అసెంబ్లీ ఎన్నికలలో పాలేరు తెరాస అభ్యర్ధి తుమ్మల నాగేశ్వరావును ఓడించిన వ్యక్తి. ఇప్పుడు ఆయన తెరాసలో చేరిపోతున్నారు కనుక తెరాస ఓడి గెలవగా కాంగ్రెస్‌ గెలిచి ఓడినట్లవుతోంది. అంటే ఎన్నికలలో ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచినా చివరికి అందరూ తెరాసలోనే చేరే పరిస్థితి వచ్చిందనుకోవాలేమో?

కందాల ఉపేందర్ రెడ్డి గురువారం ఉదయం తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి తెరాసలో చేరాలనుకొంటున్నట్లు చెప్పగా ఆయన సాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తెరాసలో చేరుతానని స్పష్టం చేశారు.