అభ్యర్థులను ప్రకటించనున్న చంద్రబాబు

SMTV Desk 2019-03-14 18:10:11  Chandra Babu,

అమరావతి: కాసేపట్లో టీడీపీ పొలిట్‌ బ్యూరో సమావేశం కానుంది. 5 గంటలకు జిల్లా పార్టీ అధ్యక్షులు, మంత్రులతో చంద్రబాబు భేటీకానున్నారు. అభ్యర్థుల ఎంపికలో పరిగణనలోకి తీసుకున్న అంశాలను చంద్రబాబు వివరించనున్నారు. ఈ సమావేశంలో జాబితాకు ఆమోద ముద్ర తర్వాత అభ్యర్థులను చంద్రబాబు ప్రకటించనున్నారు.