వైసీపీలోకి దాసరి అరుణ్..!

SMTV Desk 2019-03-14 18:07:10  YCP, dasari arun,

హైదరాబాద్, మార్చ్ 14: ప్రముఖ దర్శక-నిర్మాత దివంగత దాసరి నారాయణరావు కుమారుడు దాసరి అరుణ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన గురువారం లోటస్ పాండ్ లో జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశిస్తే ప్రచారం చేస్తా...అని తెలిపారు. మా నాన్న దాసరి నారాయణరావు ఉండుంటే వైఎస్సార్ సీపీ నుండి పోటీ చేసేవారు. వైఎస్‌ జగన్‌ ఆదేశిస్తే ప్రచారానికి వెళతాను. కాగా ఇప్పటికే ప్రముఖ హాస్యనటుడు అలీ వైఎస్సార్ సీపీలో చేరిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటేస్వామి కూడా జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.