సరికొత్త రికార్డు సృష్టించిన రౌడీబేబీ సాంగ్

SMTV Desk 2019-03-14 18:05:07  rowdy beby, Sai pallavi, Dhanush

హైదరాబాద్, మార్చ్ 14: టాలెంటెడ్ యాక్టర్ ధనుష్ హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా బాలాజీ మోహన్ దర్శకత్వంలో యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన చిత్రం “మారి 2”.తమిళ్ మరియు తెలుగు భాషల్లో విడుదలైన ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద స్థాయిలో అయితే విజయాన్ని అందుకోలేదు.కానీ మ్యూజిక్ పరంగా అయితే యువన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ పాటలు కానీ ప్రేక్షకులను బాగానే మెప్పించాయి.అందులోను ఒక పాట అయితే యూట్యూబ్ తుక్కు రేగ్గొట్టింది.అదే “రౌడీ బేబీ” సాంగ్. ఎప్పుడైతే ఈ ఫుల్ వీడియో సాంగ్ యూట్యూబ్ లో విడుదలైందో అప్పటి నుంచి ఇప్పటి వరకు రికార్డుల పరంపర కొనసాగిస్తూ బాలీవుడ్ సినిమాల పాటలకు ధీటుగా దూసుకుపోతుంది.24 గంటల్లోనే 7మిలియన్(70 లక్షల) వ్యూస్ వచ్చిన మొదటి వీడియో సాంగ్ గా,మరియు 2 లక్షల 88 వేలు లైక్స్ సంపాదించిన వీడియో సాంగ్ గా సరికొత్త రికార్డును నెలకొల్పడంతో మొదలయ్యి ఇప్పటివరకు కొనసాగుతూనే ఉంది.ఇప్పటి వరకు ఈ పాట 300 మిలియన్ వ్యూస్ తో దూసుకెళ్తూ ఇప్పటివరకు మన సౌత్ ఇండియాలోని ఏ సినిమా నెలకొల్పని సెన్సషనల్ రికార్డు సెట్ చేసే దిశగా వెళ్తుంది.ఈ పాటకి 1.8 మిలియన్ లైక్స్ కూడా ఈ వీడియో సొంతం చేసుకుంది.