పబ్‌జీ గేమ్ ఆడుతూ దొరికిన 10 మంది అరెస్ట్

SMTV Desk 2019-03-14 18:02:09  PUBG ban, arrest, Rajkot, ten people arrested for playing pubg game

గాంధీనగర్, మార్చ్ 14: ఆన్ లైన్ వీడియో గేమ్ పబ్ జికి యువతలో ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారో...పేరెంట్స్ లో అంత మంది దీనికి వ్యతిరేఖంగా ఉన్నారు. ఇక ఈ గేమ్ ను బ్యాన్ చెయ్యాలని ఎప్పటి నుండో అనేక ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో గుజరాత్ లో ఈ గేమ్ ఆడుతున్న వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. వివరాల ప్రకారం...గుజరాత్‌లోని రాజ్‌కోట్, సూరత్ జిల్లాల్లో పబ్‌జీ గేమ్‌పై నిషేధం ఉన్న విషయం తెలిసిందే. పబ్లిక్‌గా ఈ గేమ్ ఆడటం చట్ట విరుద్ధం. మార్చి 9 నుంచి ఏప్రిల్ 30 వరకు ఈ నిషేధం అమలులో ఉంటుంది. గుజరాత్‌లోని ప్రాథమిక పాఠశాలలోనూ పబ్‌జీ గేమ్‌పై నిషేధం అమలులో ఉంది.అయినా అక్కడ దొంగచాటుగా కొందరు, ఆ ఎక్కడి ఆంక్షలులే అని లైట్ తీసుకుని ఆడుతున్నారు. దీనిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఆంక్షలకు విరుద్ధంగా ఆడుతున్న పది మందిని అరెస్ట్ చేశారు. దర్యాప్తు కోసం వీరి మొబైల్ ఫోన్స్‌ను సీజ్ చేశారు. వీరిపై సెక్షన్ 188 ప్రకారం కేసు నమోదు చేశారు. కాగా, ఆరుగురు కాలేజ్ స్టూడెంట్స్‌ను బెయిల్ మీద విడుదల చేశారు. మిగతా వారి బెయిల్ ప్రక్రియ నడుస్తోందని పోలీసులు తెలిపారు. ఇకపై ఎవరు పబ్‌జీ ఆడుతున్నారని తెలిస్తే వారికి శిక్ష తప్పదని హెచ్చిరిస్తున్నారు పోలీసులు.