రాన్‌బ్యాక్సీ మాజీ ప్రమోటర్లు సింగ్‌ సోదరులను ప్రశ్నించిన సుప్రీం

SMTV Desk 2019-03-14 18:00:46  Former Ranbaxy promoters Malvinder Singh and Shivinder, supreme court, justice ranjan gogoy

న్యూఢిల్లీ, మార్చ్ 14: గురువారం సుప్రీం కోర్టులో దైచీ సంస్థ దాఖలుచేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన జస్టిస్‌ రంజన్‌ గోగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. దైచీ సంస్థకు సింగపూర్‌లోని ట్రిబ్యునల్‌ ఆదేశాల మేరకు చెల్లించాల్సిన రూ. 3500 కోట్లను రాన్‌బ్యాక్సీ మాజీ ప్రమోటర్లు సింగ్‌ సోదరులైన శివీందర్‌ సింగ్‌, మాల్వీందర్‌సింగ్‌ను ఏ విధంగా చెల్లిస్తారని సుప్రీం ప్రశ్నించింది. ఈ బెంచ్‌లో జస్టిస్‌ దీపక్‌ గుప్తా, సంజీవ్‌ ఖన్నా కూడా ఉన్నారు. ఆర్థిక సలహాదారులను సంప్రదించిన తర్వాత సరైన ప్రణాళికను ఇవ్వాలని పేర్కొంది. ఇది కేవలం వ్యక్తుల గౌరవానికి సంబందించినదే కాదు..దేశ గౌరవానికి సంబంధించినది. మీరు ఫార్మా రంగంలో అత్యున్నత స్థానంలో ఉన్నారు. మీరు కోర్టులకు రావడం మంచిది కాదు. మార్చి 28న తేదీన మీ ప్రణాళిక సమర్పించండి. మీరు కోర్టుకు రావడం అదే చివరిసారి కావాలని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.