బీదర్ టికెట్ కోసం అజారుద్దీన్‌ పాట్లు

SMTV Desk 2019-03-14 16:18:06  beedar constituency, loksabha elections, azharuddin, congress

బీదర్‌, మార్చ్ 14: రానున్న ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ నేత, టీమిండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ బీదర్‌ నుంచి పోటీ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. అధిష్టానాన్ని ఒప్పించి బీదర్‌ టిక్కెట్‌ దక్కించుకునేందుకు ఆయన పావులు కదుపుతున్నారు. బీదర్‌ తెలంగాణకు దగ్గరగా ఉండడం, అక్కడ మైనార్టీ ఓటర్లు కూడా ఉండడం కలిసి వస్తుంది అని అజారుద్దీన్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు‌. బీదర్‌ సీటు తనకే కేటాయించాలని పట్టుబడుతున్నారు. అయితే ఇదే స్థానం నుంచి పోటీ చేసేందుకు కర్ణాటక కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పావులు కదుపుతున్నారు. మరి అధిష్టానం ఎవరికి బెర్త్‌ కన్ఫామ్‌ చేస్తుందో చూడాలి.