బీజేపీ లోకి కాంగ్రెస్ కీలక నేత

SMTV Desk 2019-03-14 15:28:01  BJP, Congress,

న్యూఢిల్లీ , మార్చ్ 14: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి అత్యంత సన్నిహితుడు టామ్ వడక్కన్ అధికార బీజేపీలో చేరారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకు ముందు ఆయన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలిశారు. ‘దేశంలో టెర్రరిస్టులు దాడి చేస్తే.. దీనిపై మా (కాంగ్రెస్) పార్టీ మాట్లాడిన తీరు నన్ను చాలా బాధించింది. ఓ రాజకీయ పార్టీ దేశ సమగ్రతకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే, నాకు ఆ పార్టీని వీడడం తప్ప మరో ఆప్షన్ కనిపించలేదు.’ అని పుల్వామా ఉగ్రదాడిని ఉద్దేశించిన టామ్ వడక్కన్ వ్యాఖ్యానించారు. టామ్ వడక్కన్ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. ఏఐసీసీ కార్యదర్శిగానూ పనిచేశారు.