పవన్‌ కల్యాణ్‌ కటౌట్‌లు, పార్టీ జెండాలతో .. జనసేన ఆవిర్భావ సభ

SMTV Desk 2019-03-14 15:06:12  Jansena, Pawan Kalyan,

అమరావతి, మార్చ్ 14: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరగనుంది. జనసేన పార్టీ ఆవిర్భవించి నేటికి ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న సభకు పార్టీ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. రాజమండ్రిలోని ప్రధాన రహదారులలో పార్టీ జెండాలను ఏర్పాటు చేశారు. ఆవిర్భావ సభ మైదానంలో పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కటౌట్‌లు, పార్టీ జెండాలు, ఎయిర్‌ బెలూన్లు ఏర్పాటు చేశారు. పార్టీ ఆవిర్భావ సభకు జనసేనానితో పాటు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు భారీ సంఖ్యలో తరలిరానున్నారు.