వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకటస్వామి

SMTV Desk 2019-03-14 15:04:56  YSRCP, Venkata Swamy

హైదరాబాద్, మార్చ్ 14: కర్నూల్ జిల్లాలో ఈసారి ఎలాగైనా ఆధిక్యం ప్రదర్శించాలని భావిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు షాక్ తగిలింది. జిల్లా స్థాయిలో పార్టీలో కీలకంగా ఉన్న లబ్బి వెంకటస్వామి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈరోజే హైదరాబాదలోని లోటస్ పాండ్ వెళ్లి జగన్ మోహన్ రెడ్డిని కలిసి వైకాపా కండువా కప్పుకున్నారు. జగన్ సైతం లబ్బి వెంకటస్వామిని దగ్గరుండి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇకపోతే 2009లో కాంగ్రెస్ తరపున నందికొట్టూరు ఎమ్మెల్యేగా గెలిచిన లబ్బి వెంకటస్వామి ఆ తరవాత టీడీపీలో చేరారు. 2014లో నందికొట్టూరు స్థానాన్ని వైకాపా అభ్యర్థి గెలవగా ఈసారి వెంకటస్వామిని పూర్తిస్థాయిలో వినియోగించుకుని పట్టు బిగించాలని బాబు అనుకున్నారు. కానీ వెంకటస్వామి ఆఖరి దశలో హ్యాండ్ ఇచ్చి వైకాపా గూటికి ఎగిరిపోవడంతో ఆ స్థానంలో కొత్త అభ్యర్థిని సిద్ధం చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. అసలే జగన్ హవా మెండుగా పనిచేసే కర్నూలులో ఇప్పటికిప్పుడు కొత్త అభ్యర్థి అంటే కష్టమే మరి.