పంత్ పై వేటు తప్పదు!

SMTV Desk 2019-03-14 15:03:55  rishab pant, virat kohli, icc world cup 2019, india vs australia, odi

న్యూఢిల్లీ, మార్చ్ 14: బుధవారం జరిగిన మ్యాచ్ తరువాత మీడియాతో మాట్లాడినా టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లి తమ ఓటమిపై స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువ క్రికెటర్ రిషబ్ పంత్ పై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఓటమి తమకి మంచే చేసిందని వ్యాఖ్యానించిన కోహ్లీ.. సిరీస్‌లో చేసిన తప్పిదాలను ప్రపంచకప్‌లో దిద్దుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. అయితే ప్రపంచ కప్‌కు రిషబ్‌పంత్‌పై వేటు తప్పదని సంకేతాలిచ్చారు. ఆస్ట్రేలియాతో సిరీస్‌ కంటే ముందు జట్టులో రెండు స్థానాలకి (నెం.4 బ్యాట్స్‌మెన్, రెండో వికెట్ కీపర్) ఆటగాళ్లని పరీక్షించాలని చెప్పిన విరాట్ కోహ్లీ ఇప్పుడు ఒక స్థానంపై పూర్తి స్పష్టత వచ్చినట్లు పరోక్షంగా అంగీకరించాడు. సిరీస్‌లో నెం.4లో ఆడిన అంబటి రాయుడు నిరాశపరచగా.. అతనిపై మధ్యలోనే వేటు వేశారు. ఇక చివరి రెండు వన్డేల్లో ధోనీ స్థానంలో వికెట్ కీపర్‌గా ఆడిన పంత్‌ దారుణంగా విఫలమయ్యాడు. దీంతో.. వరల్డ్‌కప్‌లో రెండో వికెట్ కీపర్‌గా పంత్‌ను ఎంచుకుని.. నెం.4లో అంబటి రాయుడి స్థానంలో విజయ్ శంకర్‌ని ఆడించాలనే ఆలోచనలో కోహ్లీ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.