రికార్డు గరిష్టానికి చేరిన యాక్సిస్‌ బ్యాంకు షేరు

SMTV Desk 2019-03-14 14:26:28  axis bank, shares, axis bank non executive chairmen rakesh makheeja

న్యూఢిల్లీ, మార్చ్ 14: యాక్సిస్‌ బ్యాంకు వరుసగా మూడో రోజు కూడా ర్యాలీ తీస్తోంది. దీని ప్రభావం వల్ల ఈ షేరు ధర రికార్డు గరిష్టానికి చేరింది. మూడేళ్ల వ్యవధితో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా రాకేష్‌ మఖీజాను నియమిస్తున్నట్లు బ్యాంకు ప్రకటించిన సంగతి తెలిసిందే. జులై 18 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుండగా, డా.సంజీవ్‌ మిశ్రా స్థానంలో రాకేష్‌ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఎస్‌కెఎఫ్‌ ఇండియాకు చైర్మన్‌గా ఉన్న ఈయన, రెండు టాటా గ్రూప్‌ కంపెనీలకు, యాక్సిస్‌ బ్యాంకులో ఒక విభాగానికి డైరెక్టర్‌గా ఉన్నారు. ఇక దశలో 1.1శాతం పెరిగిన యాక్సిస్‌ బ్యాంకు ఆల్‌టైం హై స్థాయిని చేరుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఇలో 0.34శాతం పెరిగిన ఈ షేరు రూ.744.30 వద్ద ట్రేడవుతోంది.